nokia: అదిరిపోయే ఫీచర్లతో నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల!
- భారత మార్కెట్‌లోకి నోకియా 6.1ప్లస్
- ధర సుమారుగా రూ.15999
- ఈ నెల 30 నుండి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయం
హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1ప్లస్ ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాసేపటి క్రితం హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ జూహో సర్ వికాస్ ఈ ఫోన్ ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ 'నోకియా ఎక్ష్6' కి రీబ్రాండెడ్ వెర్షన్.
ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 30నుండి విక్రయించనున్న ఈ ఫోన్ కి వెనక భాగంలో వర్టికల్ గా రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. 4 జీబీ/64 జీబీ ఫోన్ ధర సుమారుగా రూ.15999 ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది.
నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు:
- వెనక భాగంలో 16/5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
- ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 5.8" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (19:9 అస్పేక్ట్ రేషియో)
- 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 400 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు)
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 3060ఎంఏహెచ్ బ్యాటరీ