Indonesia: కుర్రోడు పట్టేశాడు... షూటింగ్ స్వర్ణం గెలిచిన పదహారేళ్ల సౌరవ్ చౌధురి

  • 10 మీటర్ల ఎయిర్ షూటింగ్ లో స్వర్ణం
  • కాంస్యంతో సరిపెట్టుకున్న అభిషేక్ వర్మ
  • జపాన్ క్రీడాకారుడికి రజతం

ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మరో స్వర్ణపతకం భారత్ సొంతమైంది. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన పిన్న వయస్కుల్లో ఒకడైన పదహారేళ్ల సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురితప్పలేదు. జపాన్ కు చెందిన తొమొయుకి మత్సుదాతొో పాటు స్వదేశ ప్రత్యర్థి అభిషేక్ వర్మలకు గట్టి పోటీ ఇచ్చిన సౌరభ్, 240.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు. మత్సుదాకు రజతం, అభిషేక్ కు కాంస్యం దక్కాయి. 18 రౌండ్లు ముగిసేసరికి రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకున్న సౌరభ్, ఆపై తన సత్తా చాటాడు.

Indonesia
Asian Games
Shooting
Sourabh Choudhuri
  • Loading...

More Telugu News