Andhra Pradesh: నర్సీపట్నంలో అయ్యన్న గంజాయి సామ్రాజ్యం.. ఈ విషయం మంత్రి గంటానే చెప్పారు!: వైసీపీ నేత అమర్నాథ్

  • గంజాయి సాగుకు అయ్యన్న అండదండలు
  • ఆయన్ను ప్రజలే ఇంటికి సాగనంపుతారు
  • జగన్ ను విమర్శించే అర్హత అయ్యన్నకు లేదు

నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు అండదండలతోనే గంజాయి వ్యాపారం యథేచ్చగా సాగుతోందని  అనకాపల్లి వైసీసీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఈ గంజాయి గ్యాంగ్ కు అయ్యన్నపాత్రుడే డాన్ అనీ, ఈ వ్యవహారాన్ని మరో మంత్రి గంటానే బయటపెట్టారని విమర్శించారు. అయ్యన్న రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ప్రజలే ఆయన్ను సాగనంపుతారని ఎద్దేవా చేశారు.

కోటవురట్లలో జరిగిన బహిరంగ సభలో అమర్ నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత మంత్రి అయ్యన్నకు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని విషయాన్ని మాత్రమే జగన్ ప్రస్తావించారని ఆయన తెలిపారు.

Andhra Pradesh
YSRCP
amarnath
Ayyanna Patrudu
Jagan
Telugudesam
politics
  • Loading...

More Telugu News