Uttar Pradesh: యూపీలో దారుణం... ఫ్రిజ్ లో భార్య, సూట్ కేసు, బీరువాలో కుమార్తెల శవాలు... సీలింగుకి వేలాడుతూ భర్త!

  • తీవ్ర కలకలం రేపిన ఐదు మృతదేహాలు
  • సోమవారం రాత్రి స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో దారుణాతి దారుణమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల సమాచారంతో వెళ్లిన పోలీసులు, ఇంటికి వేసున్న తాళం పగులగొట్టి చూడగా, ఐదు మృతదేహాలు కనిపించాయి. నిన్న రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముందుగదిలో భర్త, అనుమానాస్పద స్థితిలో సీలింగుకి వేలాడుతూ కనిపించగా, మరో గదిలోని సూట్ కేసు, బీరువాల్లో ఆయన ఇద్దరు కుమార్తెల మృతదేహాలు, మరో గదిలో నేలపై మూడో కుమార్తె మృతదేహం, ఫ్రిజ్ లో భార్య మృతదేహం కనిపించాయి.

హత్య చేసిన తరువాత బలవంతంగా ఫ్రిజ్, బీరువా, సూట్ కేసుల్లో మృతదేహాలను కుక్కి ఉంచారు. తన భార్య, కుమార్తెలను హత్య చేసిన ఆ వ్యక్తి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో విచారిస్తున్నామని, ఇంటి బయట తాళం వేసి ఉండటంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ వెల్లడించారు.

Uttar Pradesh
Alahabad
Police
Mass Murders
Sucide
  • Loading...

More Telugu News