Nara Lokesh: రూ.2 వేల నోటును రద్దు చేయండి: మంత్రి నారా లోకేశ్ డిమాండ్

  • సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖ ప్రారంభం
  • రూ.2 వేల నోట్ల వల్ల అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆందోళన
  • నోట్ల రద్దుకు చంద్రబాబు పోరాడుతున్నారని వ్యాఖ్య

నోట్ల రద్దు తర్వాత కేంద్రం తీసుకొచ్చిన రూ.2 వేల నోటును రద్దు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ.500కు మించి పెద్ద నోటు ఉండకూడదన్నది తమ విధానమన్నారు. రూ.2 వేల నోటు వల్ల దేశంలో అవినీతి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2012 నుంచి పోరాడుతున్నారని పేర్కొన్నారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయాలని గతంలోనూ డిమాండ్ చేసినట్టు చెప్పారు. సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh
ICICI Bank
Note ban
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News