Telangana: కుటుంబ కలహాలతో మంత్రి కడియం శ్రీహరి సోదరి ఆత్మహత్య.. విలపించిన కడియం దంపతులు!

  • పదేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటున్న కన్యకాపరమేశ్వరి
  • మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం
  • అంత్యక్రియల్లో పాల్గొన్న కడియం దంపతులు

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చిన్నాన్న కుమార్తె కందుకూరి కన్యకాపరమేశ్వరి (40) ఆత్మహత్య చేసుకుని మరణించింది. వరంగల్ జిల్లా కాజీపేట జూబ్లీ మార్కెట్‌కు చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల వల్ల గత పదేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటున్న ఆమెకు రాహుల్, రోహిత్ (18) అనే కవల కుమారులున్నారు. కన్యకాపరమేశ్వరి సోదరుడు కడియం సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నాన్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మంత్రి కడియం శ్రీహరి, సతీమణి వినయరాణితో కలిసి కాజేపేట చేరుకున్నారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Telangana
Warangal
kazipet
Kadiam Srihari
Suicide
  • Loading...

More Telugu News