kerala: కేరళను ఆదుకోవడానికి విరాళం ప్రకటించిన కీర్తి సురేష్, పూనం పాండే

  • రూ. 15 లక్షల విరాళం ఇచ్చిన కీర్తి సురేష్
  • 'లేడీ గబ్బర్ సింగ్' రెమ్యునరేషన్ ను ఇస్తానన్న పూనం పాండే
  • కేరళ పరిస్థితి దిగ్భ్రాంతికి గురి చేసిందన్న పూనం

వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా కేరళ వాసుల కోసం రూ. 15 లక్షల విరాళాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు, రిలీఫ్ మెటీరియల్ కొనడానికి రూ. 5 లక్షలు ఇచ్చింది.

బాలీవుడ్ నటి పూనం పాండే కూడా కేరళకు అండగా నిలబడింది. తాజాగా ఆమె తెలుగులో కె.వీరు దర్శకత్వంలో 'లేడీ గబ్బర్ సింగ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు తాను తీసుకున్న రెమ్యునరేషన్ ను కేరళ ప్రజలకు విరాళంగా ఇస్తానని ప్రకటించింది. కేరళ పరిస్థితి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను విరాళం ఇస్తానని చెప్పింది. 

kerala
donation
keerthi suresh
poonam pandey
  • Loading...

More Telugu News