Aishwarya Rai: జయలలిత బయోపిక్ లో అనుష్క?

  • భారతీరాజా దర్శకుడిగా జయలలిత బయోపిక్ 
  • ఐశ్వర్యరాయ్ తో సంప్రదింపులు 
  • డిసెంబర్లో లాంచ్ చేయాలనే ఆలోచన

వెండితెరపై అందాల కథానాయికగా .. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను దోచుకున్నారు. అన్నివర్గాల ప్రజలచేత ఆప్యాయంగా 'అమ్మ' అనిపించుకున్నారు. అలాంటి జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి దర్శకులు ఎ.ఎల్. విజయ్ .. ప్రియదర్శన్ .. భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు వున్నారు.

భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత బయోపిక్ కోసం ఆయన ఐశ్వర్య రాయ్ ను .. అనుష్కను ఇద్దరినీ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే జాతీయస్థాయిలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిలో పడుతుంది. ఆమె కుదరదంటే మాత్రం అనుష్కను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమె స్థానం ప్రత్యేకం. ఇక ఈ సినిమాకి 'పురిచ్చి తలైవి' .. 'అమ్మ' అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.                         

Aishwarya Rai
anushka
  • Loading...

More Telugu News