Nickyanka: అక్టోబర్ లో ప్రియాంక పెళ్లి.. ఆ విశేషాలు!
- లాస్ ఏంజెల్స్ లో అక్టోబర్‌లో ప్రియాంకా చోప్రా నిక్ ల వివాహం
- ‘షాదీ స్వ్కాడ్’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థకు చెందిన వెడ్డింగ్ ప్లానర్లు
- ప్రస్తుతం ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాచేస్తున్న ప్రియాంక
ప్రియాంక చోప్రా త్వరలో ప్రముఖ అమెరికన్ గాయకుడు, నటుడు నిక్ జొనాస్ ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. నిక్ జొనాస్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రియాంక ముంబయిలోని తన నివాసంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకుంది. ఇక పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకోబోతోందట ప్రియాంక.
ముంబయికి చెందిన ‘షాదీ స్వ్కాడ్’ సంస్థకు చెందిన వెడ్డింగ్ ప్లానర్లు వీరి వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు వెడ్డింగ్ ప్లానింగ్ చేసింది ఈ సంస్థే. ఈ విషయాన్ని వారు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబర్‌లో లాస్ఏంజెల్స్లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక, నిక్ అభిమానులు వీరిద్దరి జంటకు ‘నిక్యాంక’ అంటూ ముద్దుగా పేరు కూడా పెట్టేశారు.
నిశ్చితార్ధం కోసం తన తల్లిదండ్రులతో కలసి ముంబై వచ్చిన నిక్ మరో రెండు రోజుల్లో అమెరికా వెళ్లిపోతారు. మరోపక్క ప్రియాంక తాను సంతకం చేసిన హిందీ ప్రాజెక్ట్ ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ సినిమా చిత్రీకరణ తర్వాత ఆమె కూడా అమెరికా వెళుతుందని తెలుస్తోంది. ఇక అక్టోబర్‌లో జరిగే వీరి పెళ్లి వేడుకను చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.