Sea: కాలుజారి సముద్రంలో పడ్డ యువతి.. పది గంటల తర్వాత సజీవంగా బయటకు!

  • స్నేహితులతో కలిసి షిప్ లో విహారం 
  • ప్రమాదవశాత్తు సముద్రంలో పడిన యువతి 
  • యువతిని రక్షించిన నేవీ అధికారులు

పొరపాటున కాలుజారి సముద్రంలో పడిపోతే.. ఎవరైనా సరే ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, అలా పడిన ఓ మహిళ 10 గంటల పాటు సముద్రంలోనే వుండి బతికి బట్టకట్టిందంటే వండరే కదా? బ్రిటన్ కు చెందిన ఓ మహిళ విషయంలో అదే జరిగింది.  

ఆ వివరాల్లోకి వెళితే, క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్ లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తోంది బ్రిటన్ కు చెందిన కేయ్ అనే మహిళ. అయితే, షిప్ అంచున నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతుండగా కాలుజారి నీటిలో పడిపోయిందట. ఆమె పడిపోవడాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు.

ఆమె పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీరప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఉంది. వెంటనే వారు నేవీ అధికారులకు తెలియజేశారు. గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీరప్రాంత అధికారులు పీసీ-9 విమానంతో గాలింపు చేపట్టి యువతిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మొత్తానికి 10 గంటల పాటు సముద్రంలో వున్నా ఎవరూ ఊహించని విధంగా ఆమె ప్రాణాలతో తిరిగొచ్చింది.  అయితే, అంతసేపూ నీళ్లల్లో వున్నా ఆమె ప్రాణాలతో ఎలా నిలిచిందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆమె కూడా ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోతోంది. ఆమె స్నేహితులు మాత్రం ఇదంతా మిరకిల్ అంటున్నారు.  

Sea
  • Loading...

More Telugu News