kidnap: బిస్కెట్లు ఎరగా వేసి పిల్లాడిని ఎత్తుకెళ్లారు!: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి
  • ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు గుర్తింపు
  • కిడ్నాపర్ల కోసం గాలిస్తున్న పోలీసులు

బిస్కెట్ ఆశ చూపిన కిడ్నాపర్లు ఓ బాలుడిని ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఈ రోజు చోటుచేసుకుంది. పిల్లాడు కనిపించకపోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్ లోని బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న అంజుమ్ తన కుమారుడు ఆయుష్ తో కలసి యూపీలోని కాన్పూర్ కు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చారు. అంజుమ్ పరధ్యానంలో ఉండటంతో ప్లాట్ ఫామ్ పై ఆడుకుంటున్న ఆయుష్ వద్దకు ఇద్దరు మహిళలు వచ్చారు. బిస్కెట్లు ఇప్పిస్తామంటూ బయటకు తీసుకెళ్లిపోయారు.

కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు మహిళలు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

kidnap
secundrabad
Hyderabad
railway station
cookies
Police
two women
  • Loading...

More Telugu News