chaitu: కేరళలో 'శైలజా రెడ్డి అల్లుడు' రీరికార్డింగ్.. రిలీజ్ డౌటే?

  • కేరళను ముంచెత్తుతోన్న వరదలు 
  • అక్కడ జరుగుతోన్న రీ రికార్డింగ్ కి అంతరాయం 
  • అక్కడే ఉండిపోయిన మారుతి  

మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' రూపొందుతోంది. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాకి రీ రికార్డింగ్ పనులు కొన్ని రోజులుగా కేరళలో జరుగుతున్నాయి. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీసుందర్ కేరళకు చెందినవాడు కావడంతో, ఆయనతో రీరికార్డింగ్ చేయించుకోవడం కోసం దర్శకుడు మారుతి అక్కడికి వెళ్లాడు. ఆ వెంటనే కేరళలో వానలు .. వరదలు మొదలయ్యాయి.

అక్కడి పరిస్థితులు అతలాకుతలం కావడంతో రీ రికార్డింగ్ పనులకు అంతరాయం కలిగింది. అక్కడి రీ రికార్డింగ్ పనులు ఆగిపోవడం .. అక్కడ మారుతి చిక్కుబడటం వలన, ఆయన ఇక్కడ చేయవలసిన పనులు కూడా ఆగిపోయాయి. అనుకోకుండా వచ్చిన ఈ అవాంతరం వలన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయలేకపోతే, సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావలసి వుంది.  

chaitu
anu emmanuel
  • Loading...

More Telugu News