kcr: కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన పినరయి విజయన్.. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన వెంకయ్య

  • కేరళకు 25 కోట్ల విరాళం అందించిన టీఎస్ ప్రభుత్వం
  • కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన కేరళ సీఎం
  • నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు

భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగతంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలసి చెక్ ను అందించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు పినరయి విజయన్ లేఖ రాశారు. కేరళను ఆదుకునేందుకు భారీ మొత్తంలో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేరళకు తన వంతు సాయాన్ని ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇస్తున్నట్టు తెలిపారు. ఇదే విధంగా శివసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నెల జీతాన్ని కేరళకు ఇస్తున్నట్టు ప్రకటించారు.

kcr
pinarayi vijayan
letter
Venkaiah Naidu
shiv sena
  • Loading...

More Telugu News