Bhajarang puniya: ఆసియాక్రీడల్లో భారత్: రెజ్లింగ్ లో తొలిరోజే స్వర్ణం
- ఆసియా క్రీడల్లో 65 కిలోల రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన భజరంగ్ పునియా
- ఫైనల్ లో జపాన్‌కు చెందిన తకటా పై 11-8 తేడాతో విజయం
- తొలిరోజు భారత్ ఖాతాలో తొలి స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలిరోజే స్వర్ణ పతకం లభించింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలిరోజు 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది. 2014లో జరిగిన క్రీడల్లో భజరంగ్ పునియా రజత పతకం సాధిస్తే, ఈ సారి మాత్రం తొలిరోజే గోల్డ్ మెడల్ సాధించి భారత్ పేరు నిలబెట్టాడు. భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు.
పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో జపాన్‌కు చెందిన తకటాతో తలపడిన భజరంగ్ ఫైనల్లో తకాటాపై 11-8 తేడాతో పునియా విజయం సాధించి సత్తా చాటాడు. ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం కొట్టాడు. దీనికి ముందు, సెమీ ఫైనల్లో మంగోలియాకు చెందిన బచూలున్‌పై 10-0తో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. క్వార్టర్స్‌లో ఫైజీవ్ అబ్దుల్ ఖాసీమ్‌పై 12-2తో పునియా అద్భుత విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడల్లో పునియాకు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం మరో విశేషం.