disha poovaiah: హీరోయిన్ దిశా కుటుంబాన్ని ఆదుకోండి: కర్ణాటక సీఎం ఆదేశం

  • కొడగు జిల్లాను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
  • ముక్కోడులో చిక్కుకుపోయిన దిషా కుటుంబీకులు
  • సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు కుమారస్వామి ఆదేశం

భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని కొడగు జిల్లా అతలాకుతలమయింది. ఇళ్లపైకి చేరుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కోడులో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కన్నడ హీరోయిన్ దిశా పూవయ్య ముఖ్యమంత్రి కుమారస్వామిని కోరారు.

అక్కడ కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె విన్నపంపై కుమారస్వామి స్పందించారు. వెంటనే ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. దిశా కుటుంబీకులు సుమారు 70 మంది అక్కడ నివసిస్తున్నారు. వారిలో ఇద్దరు నిండు గర్భిణీలు కూడా ఉన్నారు.

disha poovaiah
family
floods
kumaraswamy
  • Loading...

More Telugu News