YSRCP: రాజకీయాలను భ్రష్టు పట్టించిందే మీరు.. నీతులు చెప్పొద్దు!: వైఎస్ జగన్ పై మంత్రి అయ్యన్న ఫైర్

  • ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
  • వ్యవస్థ చెడిపోయిందని జగన్ చెప్పడం దురదృష్టకరం
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తనపై జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని జగన్ మాటిమాటికీ అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అసలు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే జగన్ అని అయ్యన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఆయన వల్లే అసలు రాజకీయాల్లో విలువలు దిగజారాయని ఆరోపించారు. ఇతరులకు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు. బురదలో కూరుకుపోయిన జగన్ చంద్రబాబు, టీడీపీ నేతలపై దాన్ని చల్లే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న నిందించారు. 

YSRCP
JAGAN
Ayyanna Patrudu
Telugudesam
ANGRY
VALUES
POLITICS
  • Loading...

More Telugu News