Asian Games: 18వ ఆసియా క్రీడలు.. అట్టహాసంగా ప్రారంభ వేడుకలు

  • ఇండోనేషియాలోని జకార్తలో ఏషియన్ గేమ్స్
  • జీబీకే స్టేడియంలో అట్టహాసంగా వేడుకలు
  • 45 దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు
  • భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు

ఇండోనేషియాలోని జకార్తలో 18వ ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. జకార్తాలోని ప్రధాన స్టేడియం గెలోరా బంగ్ కర్నో (జీబీకే) లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ సింగర్లు తమ ఆటపాటలతో ఉత్సాహపరిచారు. కాగా, 45 దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు. వీరిలో 311 మంది పురుషులు, 260 మంది మహిళలు ఉన్నారు. షూటింగ్, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్ లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Asian Games
jakarta
  • Loading...

More Telugu News