Vijayawada: అమ్మవారి గుడిలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు!: పాలకమండలి మాజీ సభ్యురాలి ఆరోపణ

  • పాలకమండలి సభ్యుడు శంకరబాబు స్త్రీలను వేధిస్తున్నాడు
  • అతనికి చైర్మన్ గౌరంబాబు అండ ఉంది
  • అక్రమాలు ప్రశ్నించినందుకు నాపై దొంగగా ముద్రవేశారు

విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో ఇటీవల చీర చోరీ వ్యవహారం రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతను ప్రభుత్వం గతంలో బాధ్యతల నుంచి తప్పించింది. తాజాగా దుర్గ గుడిలో పనిచేసే మహిళా ఉద్యోగులను పాలకమండలి సభ్యులు లైంగికంగా వేధిస్తున్నారని సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు.

పాలకమండలి సభ్యుడిగా ఉన్న వెలగపూడి శంకరబాబు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు. శంకరబాబుకు పాలకమండలి చైర్మన్ గౌరంబాబు అండగా నిలుస్తున్నారని సూర్యలత అన్నారు. అమ్మవారి చీరలకు సంబంధించి చాలా అక్రమాలు జరిగాయనీ, వాటిని ప్రశ్నించినందుకు తనపైనే చీర దొంగిలించినట్లు అభాండాలు వేశారని ఆమె వాపోయారు. తాను అసలు ఏ తప్పూ చేయలేదని సూర్యలత మరోసారి స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News