disco shanthi: అవకాశాల కోసం వాళ్లే వెళుతున్నారు.. క్యాస్టింగ్ కౌచ్ పై డిస్కో శాంతి స్పందన!

  • మహిళలను ఎవరూ బలవంతం చేయరు
  • అవకాశాల కోసం కొందరు వారంతట వారే వెళతారు
  • నాతో ఎవరైనా అలా ప్రవర్తిస్తే చంపేస్తా

మన తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరంటే... ఠక్కున గుర్తొచ్చే వారిలో డిస్కోశాంతి ఒకరు. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించిన శాంతి... శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై, పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ డిస్కోశాంతిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాలను ఆమె ముక్కుసూటిగా తెలిపారు.

క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ప్రతి చోటా ఉంటాయని శాంతి చెప్పారు. అయితే ఎవరూ కూడా మహిళలను బలవంతం చేయరని... అలా చేస్తే జైలుకు వెళతామనే భయం అందర్లో ఉంటుందని చెప్పారు. అవకాశాల కోసం కొందరు వారంతట వారే వెళుతున్నారని... ఆ తర్వాత మీడియాలో పబ్లిసిటీ కోసం ఆ విషయాలను చెప్పుకుంటుంటారని తెలిపారు.

 మగవాడు పిలిచిననప్పుడే చెంప పగులకొడితే... అసలు ఇబ్బందే లేదు కదా? అని అన్నారు. తనవరకైతే అలాంటి అనుభవం ఎదురు కాలేదని... తనను చూస్తేనే అందరూ భయపడతారని తెలిపారు. ఎవరైనా తనతో అలా ప్రవర్తిస్తే చంపేస్తానని చెప్పారు. తనతో ఎవరూ మాట్లాడనే మాట్లాడరని, తన నోటి నుంచి ముందు బూతులే వస్తాయని అన్నారు.

disco shanthi
Casting Couch
tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News