infosys: 18 ఏళ్ల తర్వాత ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసిన సీఎఫ్ఓ రంగనాథ్

  • రాజీనామాను అంగీకరించిన బోర్డు
  • 18 ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ కు సేవలందించిన రంగనాథ్
  • వివరణ ఇచ్చేందుకు అందుబాటులో లేని రంగనాథ్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు ఆ సంస్థ సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) రంగనాథ్ రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా ఆయన ఇన్ఫోసిస్ కు సేవలు అందించారు. ఆయన రాజీనామాను ఇన్ఫోసిస్ బోర్డు అంగీకరించింది. 2015లో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ వరకు ఆయన సీఎఫ్ఓగా కొనసాగాల్సి ఉందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో ఇన్ఫోసిస్ పేర్కొంది. అయితే రంగనాథ్ ఎందుకు రాజీనామా చేశారన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై వివరణ ఇచ్చేందుకు రంగనాథ్ అందుబాటులో లేరు.

infosys
cfo
ranganath
resignation
  • Loading...

More Telugu News