nagachaitanya: తెలంగాణ యాసలో దుమ్మురేపేస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సాంగ్

- రమ్యకృష్ణ కీలక పాత్రగా 'శైలజా రెడ్డి అల్లుడు'
- గోపీసుందర్ సంగీతంలో మంగ్లీ పాడిన పాట
- ఈ నెల 31వ తేదీన సినిమా విడుదల
కొత్త కథలను సిద్ధం చేసుకోవడంలోను .. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు మారుతికి మంచి నైపుణ్యం వుంది. ఆయన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ నాయకా నాయికలుగా నటించగా, హీరోకి అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్ చేసింది.
గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, తాజాగా ఈ సినిమా నుంచి సింగర్ సత్యవతి (మంగ్లీ) పాడిన ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో .. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడటంలో మంగ్లీకి మంచి పేరుంది. ఈ సినిమాలోని పాట కూడా 'శైలజా రెడ్డి అల్లుడు జూడే ..' అంటూ తెలంగాణ యాసలో అదరగొట్టేస్తోంది.
