santhosh sobhan: మాటలతోనే ఆకట్టుకుంటోన్న 'పేపర్ బాయ్' ట్రైలర్!

  • మరో ప్రేమకథాంశంగా 'పేపర్ బాయ్'
  • నిర్మాతగా సంపత్ నంది 
  • వచ్చేనెల 7వ తేదీన విడుదల

ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథలు కొన్ని భారీ విజయాలను అందుకున్నాయి. పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, భారీ వసూళ్లను రాబట్టాయి. దాంతో యువ దర్శకులు ప్రేమకథలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'పేపర్ బాయ్' రెడీ అవుతున్నాడు. జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

హీరో హీరోయిన్ల కాంబినేషన్లోని సన్నివేశాలపైనే ట్రైలర్ ను కట్ చేశారు. "నాకు పరిచయమైంది పుస్తకాలు .. దగ్గరైంది అక్షరాలు" .." ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది .. అది కనిపించదు .. కానీ బతికేస్తుంది".. "ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు .. ఊపిరి మార్చుకోవడం" అనే డైలాగ్స్ యూత్ మనసులను ఆకట్టుకునేలా వున్నాయి. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News