sidhu: సిద్ధూను ఆప్యాయంగా హత్తుకున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్!

  • ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సిద్ధూ
  • ఇస్లామాబాద్ లో ఘన స్వాగతం
  • సిద్ధూతో ఆప్యాయంగా గడిపిన పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈరోజు ఆ దేశ ప్రధానిగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడానికి ఇస్లామాబాద్ కు మన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా... సిద్ధూతో ఆప్యాయంగా గడిపారు. ఆయనను ప్రేమతో హత్తుకున్నారు. సిద్ధూ చేయి పట్టుకుని ఎంతో అభిమానంతో మాట్లాడారు. ఈ ఫొటోలు ఇప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News