venkatesh: బ్యాంకాక్ వెళుతున్న 'ఎఫ్ 2' యూనిట్!

- షూటింగు దశలో 'ఎఫ్ 2'
- తొలి షెడ్యూల్ పూర్తి
- జనవరి 12వ తేదీన రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ సరసన తమన్నా నటిస్తుండగా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఇటీవలే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంది.
