America: భార్య పక్కనుండగానే విమానంలో మరో యువతిపై లైంగిక దాడి.. భారత ఐటీ మేనేజర్‌ను దోషిగా తేల్చిన కోర్టు!

  • డెట్రాయిట్ వెళ్లే విమానంలో పాడుపని
  • యువతిని అసభ్యంగా తడిమిన ఐటీ మేనేజర్
  • డిసెంబరులో శిక్ష ఖరారు

తన పక్కన భార్య ఉందన్న ఇంగితాన్ని మరిచి పక్క సీట్లో కూర్చున్న 22 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించిన భారతీయుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఏడు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. డిసెంబరులో అతడికి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.

అమెరికాలోని రోచెస్టర్ హిల్స్‌లో ఉంటున్న రమణమూర్తి ఓ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం డెట్రాయిట్ వెళ్లేందుకు భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో విమానం ఎక్కాడు. తనకు ఓ వైపు భార్య కూర్చోగా, మరోవైపున ఓ యువతి కూర్చుంది. ఆమె నిద్రలోకి జారుకున్నాక రమణమూర్తి ఆమెపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. రహస్య భాగాల్లో చేతులు వేస్తూ తడిమాడు. ఉలిక్కిపడి చూసిన ఆమె రమణమూర్తి తనను తడుముతుండడం గమనించి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో రమణమూర్తి నేరాన్ని అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్ కోర్టు రమణమూర్తిని దోషిగా తేల్చింది. డిసెంబరు 12న అతడికి శిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News