Kerala: విలేకరి ఔదార్యం! కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ డబ్బును సీఎం సహాయనిధికి ఇచ్చిన వైనం!

  • జల విలయంతో అల్లాడుతున్న కేరళ
  • కుమార్తె నిశ్చితార్థాన్ని రద్దు చేసిన విలేకరి
  • సీఎం సహాయనిధికి విరాళం

జల విలయంతో కేరళ అల్లాడిపోతోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేరళను ఆదుకునేందుకు రాష్ట్రాలన్నీ ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కేరళకే చెందిన మనోజ్ కుమార్ అనే ఓ విలేకరి ఉడతాభక్తిగా తన శక్తి మేరకు సాయం అందించి శభాష్ అనిపించుకున్నాడు.

ఈ నెల 19న మనోజ్ కుమార్ కుమార్తె నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే, వరదలతో ప్రజలంతా అష్టకష్టాలు పడుతుంటే తన ఇంట్లో శుభకార్యం జరుపుకోవడం సబబు కాదని ఆయన భావించారు. విషయాన్ని వరుడి తరపు బంధువులకు చెప్పి నిశ్చితార్థ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అందుకోసం ఉంచిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. మనోజ్ కుమార్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Kerala
Floods
Journalist
Marriage
CM Relief Fund
  • Loading...

More Telugu News