Chandrababu: కేరళ బాధితులకు రూ.10 కోట్లు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు

  • వస్తు రూపేణా, ఇతరత్రా సాయం అందించేందుకు సిద్ధం
  • ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
  • కేరళకు రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించిన ఢిల్లీ సీఎం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఏపీ ప్రభుత్వం విరాళం ప్రకటించింది. కేరళ ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రూ.10 కోట్ల సాయం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వస్తు రూపేణా, ఇంకా ఇతరత్రా సాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. కేరళ సీఎం సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Chandrababu
donation
Kerala
  • Loading...

More Telugu News