vajpayee: యూపీలోని అన్ని నదుల్లో వాజ్ పేయి అస్థికలను కలుపుతాం: సీఎం యోగి ఆదిత్యానాథ్
- యూపీతో వాజ్ పేయికి ఎంతో అనుబంధం ఉంది
- అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాం
- గంగ, యమున తదితర నదుల్లో అస్థికలు కలుపుతాం
ఉత్తరప్రదేశ్ లో ఉన్న అన్ని నదుల్లోనూ మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి అస్థికలను నిమజ్జనం చేయనున్నారు. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో వాజ్ పేయికి ఉన్న అనుబంధం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాజ్ పేయి అస్థికలను యూపీలోని గంగ, యమున, తపతి మొదలైన నదులన్నింటిలోనూ నిమజ్జనం చేస్తామని చెప్పారు.
కాగా, వాజ్ పేయి జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. యూపీలోని ఆగ్రా జిల్లాలోని బటేశ్వర్ లో వాజ్ పేయి పూర్వీకుల ఇల్లు ఉంది. కాన్పూర్ యూనివర్శిటీ నుంచి రాజకీయశాస్త్రంలో ఆయన పీజీ చేశారు. యూపీలోని బల్రాంపూర్ నుంచి తొలిసారిగా ఆయన పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. గతంలో లక్నో నియోజకవర్గం నుంచి పలుసార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.