paruchuri gopaklakrishna: 'నరసింహుడు' సినిమాలో ఆ తప్పు జరిగిపోయింది!: పరుచూరి గోపాలకృష్ణ

  • అమెరికా వెళ్లి వచ్చేలోగా కథ మారిపోయింది 
  • అప్పటికి ఎన్టీఆర్ 'ఆది' .. 'సింహాద్రి' చేసి వున్నాడు
  • సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు

పరుచూరి గోపాలకృష్ణ విభిన్నమైన కథలతో .. పదునైన సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. రచయితగా ఆయన ఖాతాలో అనేక చిత్రాలు కనిపిస్తాయి. ఆయన ప్రతిభాపాటవాలకు అవి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ .. తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ .. 'నరసింహుడు' సినిమాను గురించి ప్రస్తావించారు.

ఎన్టీఆర్ హీరోగా .. బి.గోపాల్ దర్శకత్వంలో .. విజయేంద్ర ప్రసాద్ కథతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ సినిమాకి కొంతవరకూ నేను మాటలు రాసేసి అమెరికా వెళ్లి వచ్చాను. ఈ లోగా కథ మారిపోయింది .. సాయికుమార్ తమ్ముడు రవి కథను తీసుకున్నారు. ఆ కథను నాకు చెప్పారు .. అదే 'నరసింహుడు'. అప్పటికే 'ఆది' .. 'సింహాద్రి' చేసేసిన ఎన్టీఆర్ కి ఆ కథ ఎంతవరకూ కరెక్ట్ అనే సందేహాన్ని వ్యక్తం చేశాను. దర్శక నిర్మాతలు బాగానే ఉంటుందనడంతో సరే మీ ఇష్టం అన్నాను. ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే అమీషా పటేల్ .. తారక్ మధ్య లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. హీరో మూగవాడు కాదు అని తెలుసుకున్న ఆడియన్స్ భయంకరమైన కథను ఊహించుకుంటారు. అలాంటప్పుడు సడెన్ గా లవ్ స్టోరీ చెప్పడం కరెక్ట్ కాదు అన్నాను. అమీషా పటేల్ కోసం చూస్తారని నిర్మాత అన్నారు. ఫ్లాష్ బ్యాక్ మొదలైన గంటవరకూ హీరో .. ఎవరిని ఎందుకు చంపుతున్నాడో ఆడియన్స్ కి తెలియలేదు. అందువల్లనే ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ కాలేకపోయారు. సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు .. ఈ సినిమాలో ఆ తప్పు జరిగింది" అని చెప్పుకొచ్చారు.        

  • Loading...

More Telugu News