vijay: విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం: దర్శకుడు అట్లీ కుమార్

- 'తెరి' .. 'మెర్సల్' సూపర్ హిట్స్
- విజయ్ తో అట్లీ మరో ప్రాజెక్టు
- కథపై జరుగుతోన్న కసరత్తు
విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'తెరి' .. 'మెర్సల్' కూడా ముందు వరుసలో కనిపిస్తాయి. విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా ఇవి నిలిచాయి. విజయ్ కి ఈ స్థాయి సక్సెస్ లను ఇచ్చిన దర్శకుడు అట్లీ కుమార్. ఈ దర్శకుడికి మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందువల్లనే పై రెండు సినిమాలకి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో విజయ్ తో మరో సినిమా చేయడానికి అట్లీ కుమార్ రెడీ అవుతున్నాడు.
