vajpayee: వాజ్ పేయికి తుది నివాళులర్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

  • పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన మన్మోహన్  
  • అంతకుముందు, అద్వానీ, అమిత్ షా నివాళులు
  • కన్నీటి పర్యంతమైన వాజ్ పేయి కుటుంబసభ్యులు

ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి భౌతిక కాయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది నివాళులర్పించారు. వాజ్ పేయి శవపేటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మన్మోహన్ నివాళులర్పించారు. అంతకుముందు, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, అమిత్ షా, భూటాన్ రాజు వాంగ్ చుక్, నేపాల్ మంత్రి తదితరులు తుది నివాళులర్పించారు. కాగా, వాజ్ పేయి భౌతికకాయానికి తుది నివాళులర్పించిన ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వాజ్ పేయిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

vajpayee
manmohan singh
  • Loading...

More Telugu News