vajpayee: స్మృతి స్థల్ కు చేరుకున్న వాజ్ పేయి అంతిమయాత్ర

  • నాలుగు కిలోమీటర్లు కొనసాగిన అంతిమయాత్ర
  • తుది నివాళులర్పించిన త్రివిధ దళాధితులు, లోక్ సభ స్పీకర్, ప్రధాని మోదీ 
  • కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర స్మృతి స్థల్ కు చేరుకుంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సాగింది. వాజ్ పేయి భౌతిక కాయానికి త్రివిధ దళాదిపతులు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు తుది నివాళులర్పించారు.

కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్ పేయి అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News