Andhra Pradesh: వాజ్ పేయి మృతికి సంతాపంగా సెలవు ప్రకటించని ఏపీ సర్కారు!
- సెలవు ప్రకటించిన 16 రాష్ట్రాలు
- ఏపీలో పనిచేస్తున్న స్కూళ్లు
- సెలవు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం
భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతికి సంతాప సూచకంగా 16 రాష్ట్రాలు సెలవును ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం సెలవు ప్రకటించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీలో నేడు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా చాలా ఉత్తరాది రాష్ట్రాలు వాజ్ పేయికి సంతాపం తెలుపుతూ, నేడు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీజేపీ పాలనలో లేని ఢిల్లీ సర్కారు కూడా ఒకరోజు సెలవు ప్రకటించగా, పశ్చిమ బెంగాల్ హాఫ్ డే లీవ్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా ఒకరోజు సెలవు ఇచ్చి, వాజ్ పేయికి నివాళి అర్పించివుంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది.