Vajpayee: రొయ్యల కూరంటే చాలు.. లొట్టలేసుకుని తినేవారు!

  • ఎక్కడికి వెళ్తే అక్కడి ఆహారం తీసుకునేవారు
  • చైనీస్ ఫుడ్డన్నా.. రొయ్యల కూరన్నా చెప్పలేనంత ఇష్టం
  • వాజ్‌పేయి వద్దకు రొయ్యలతో వెళ్లే వెంకయ్య

వాజ్‌పేయి మంచి భోజన ప్రియుడు. అంతేకాదు, వంట చేయడంలో చెయ్యి తిరిగిన వ్యక్తి కూడా. శాకాహారమైనా, మాంసాహారమైనా ఇష్టంగా తినేవారు. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి ఆహారాన్ని తీసుకునేవారు. హైదరాబాద్ వస్తే బిర్యానీ, హలీం, కోల్‌కతా వెళ్తే పచ్కాలు, లక్నో వెళ్తే గలోటీ కబాబ్‌లను తప్పకుండా ఆయన మెనూలో ఉండాల్సిందే. మంత్రివర్గ సమావేశాల్లో వేరుశనగ పలుకులు తీసుకునేవారు.

ఇక వేపుళ్లు, కిచిడీ, చేపల కూర, చైనీస్ ఫుడ్ అంటే ప్రాణమే. మాంసాహారంలో ప్రత్యేకించి రొయ్యలంటే చెప్పలేనంత ఇష్టం. రెండు రోజులకోసారి ఆయన రొయ్యలతో చేసిన ఏదో ఒక వంటకాన్ని తినేవారు. వాజ్‌పేయి ఇష్టాన్ని తెలిసిన ఆయన వ్యక్తిగత చెఫ్ శివకుమార్ కమ్మగా వండిపెట్టేవారు. వాజ్‌పేయి కోసం వెంకయ్యనాయుడు ప్రత్యేకించి రొయ్యలు తీసుకెళ్లేవారట.

  • Error fetching data: Network response was not ok

More Telugu News