Imran khan: ఉపఖండంలోనే వాజ్‌పేయి గొప్ప నేత : పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్

  • వాజ్‌పేయి మృతికి ఇమ్రాన్ సంతాపం
  • భారత్-పాక్ మధ్య సంబంధాల మెరుగుకు ఆయన కృషి అమోఘం
  • ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్‌పేయి చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. వాజ్‌పేయి ఉప ఖండంలోనే గొప్ప నేత అని ఇమ్రాన్ కొనియాడారు. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) విజయం సాధించింది. రేపు (శనివారం) ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News