AB Vajpayee: మరణంపై నేనే గెలిచాను... యుద్ధం చేయకుండానే!: వాజ్‌పేయి
- మృత్యువుతో పలుమార్లు పోరాటం
- 1988లో కిడ్నీ ఆపరేషన్ కోసం అమెరికాకు
- తన మరణం తప్పదని భావించిన వాజ్‌పేయి
1988లో వాజ్‌పేయి తన మరణం ఖాయమని భావించారు. అయినప్పటికీ ఆయనేమీ కుంగిపోలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. పలుమార్లు మృత్యువు ఆయన చెంతకొచ్చింది. అయినప్పటికీ ఏమీ చేయలేకపోయింది. చివరికి 93 ఏళ్ల వయసులో తనతో తీసుకెళ్లింది. పలుమార్లు మృత్యువు అంచుల వరకు వెళ్లిన వాజ్‌పేయి గత తొమ్మిదేళ్లుగా దానితో పోరాటం చేశారు. రెండున్నర నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు.
1988లో కిడ్నీ ఆపరేషన్ కోసం వాజ్‌పేయి అమెరికా వెళ్లారు. ఇక తన పని అయిపోయిందని ఓ అంచనా కొచ్చారు. కానీ, ఆత్మవిశ్వాసం ముందు మృత్యువు నిలవలేకపోయింది. మరణాన్ని జయించిన ఆయన ఓ కవితను రాసుకున్నారు. ‘‘మృత్యువుతో ఢీ తప్పదనుకున్నా.. పోరాడి గెలవాలనే ఆరాటం నాకు లేదు.. కానీ, జరిగిందేమిటో తెలియదు.. మరణంపై నేనే గెలిచాను... యుద్ధం చేయకుండానే’’ అని సాగుతుందీ కవిత.