vajpayee: తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది: ప్రధాని మోదీ

  • వాజ్ పేయి పార్థివదేహానికి నివాళులర్పించిన మోదీ
  • భారతదేశం ఒక దిగ్గజ నేతను కోల్పోయింది
  • మహానాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా

వాజ్ పేయి మృతితో భారతదేశం ఒక దిగ్గజ నేతను కోల్పోయిందని, తండ్రిని కోల్పోయినంత బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసంలో పార్థివదేహాన్ని మోదీ సందర్శించి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మోదీ మాట్లాడుతూ, వాజ్ పేయి మరణం దేశానికి తీరనిలోటని, ఆయన మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలిచారని, మహానాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయిదేనని కొనియాడారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News