Atal Bihari Vajpayee: వాజ్ పేయి మృతి భారత్ కి ఎంతో నష్టం!: సచిన్ టెండూల్కర్

  • మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై సచిన్ స్పందన
  • ఆయన మృతి భారత దేశానికి ఎంతో నష్టం అన్న సచిన్ 
  • వాజ్ పేయి కుటుంబ సభ్యులకు సచిన్ ప్రగాఢ సానుభూతి

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన, నిబద్ధత కలిగిన నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం 05.05 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతిపై టీం ఇండియా క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సంతాపాన్ని తెలిపారు. వాజ్‌పేయి మృతితో భారతదేశం ఎంతో నష్టపోయిందని ఆయన అన్నారు. ‘‘ఈరోజు భారత్ చాలా నష్టపోయింది. భారత దేశానికి అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ఎన్నో అసంఖ్యాకమైన సేవలు అందించారు. ఆయన కుటుంబసభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని సచిన్ టెండూల్కర్  ట్వీట్ చేశారు.

Atal Bihari Vajpayee
  • Loading...

More Telugu News