vajpayee: వాజ్ పేయి కన్నుమూత.. అస్తమించిన రాజకీయ భీష్ముడు!

  • తుదిశ్వాస విడిచిన వాజ పేయి
  • ప్రకటించిన ఎయిమ్స్ వైద్యులు
  • కన్నీటిసంద్రమైన దేశ ప్రజలు

భారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్ పేయి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. వాజ్ పేయి వయసు 93 సంవత్సరాలు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న వాజ్ పేయి... నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని, పెంచారు. వాజ్ పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు, వాజ్ పేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు. 

vajpayee
died
  • Loading...

More Telugu News