Deepika Padukone: తమ పెళ్లికి వచ్చే గెస్ట్ లకు షరతు విధించిన దీపికా పదుకునే, రణవీర్ సింగ్!

  • ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్
  • నవంబర్ 20న వివాహ వేడుక
  • కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక

బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ... నవంబర్ 20న పెళ్లి జరగబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్ లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ జంటకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి డీఎన్ఏ పత్రికకు కొన్ని లీకులు వదిలారు.

ఆ పత్రిక కథనం ప్రకారం... పెళ్లికి హాజరయ్యే అతిథులకు దీపిక, రణవీర్ లు ఒక షరతు విధించారట. వివాహ వేడుకకు ఎవరూ సెల్ ఫోన్లను తీసుకు రావద్దనేదే ఆ షరతు. వీరిది డెస్టినేషన్ వివాహం కావడంతో... కేవలం కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. వీరి సంఖ్య 30 వరకు ఉంటుందట. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

Deepika Padukone
ranveer singh
wedding
bollywood
  • Loading...

More Telugu News