dhoni: ఓ హోటల్ లో ధోనీ, కూతురు జీవా.. ఆసక్తికర ఫొటో!

  • ఓ హోటల్ లో తండ్రీకూతురు
  • తమ చేతిలో గాడ్జెట్లను చూస్తున్న ధోనీ, జీవా
  • ఆసక్తికరంగా ఉన్న ఫొటో

టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ, తన కుమార్తె జీవాకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలు ఎన్నో ఇప్పటికే చూశాం. తాజాగా, ధోనీ, జీవాలకు సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. ఓ హోటల్ లో కూర్చుని ఉన్న తండ్రీకూతురు.. తమ చేతిలో ఉన్న గాడ్జెట్లను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. ధోనీ తన ఐ ప్యాడ్ ను చూస్తుండగా, చిన్నారి జీవా తానేమీ తక్కువ కాదంటూ ఓ బుల్లి ఐ ప్యాడ్ ను ఎంతో శ్రద్ధగా చూస్తూ కూర్చుంది. వీరి ముందున్న టేబుల్ పై సూప్ బౌల్స్, టీ కప్పులు.. కనిపిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News