vijay devarakonda: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విజయ్ దేవరకొండ

- క్రాంతిమాధవ్ నెక్స్ట్ ప్రాజెక్టుకి సన్నాహాలు
- విజయ్ దేవరకొండకు జోడిగా రాశి ఖన్నా
- వచ్చేనెలలో సెట్స్ పైకి
విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. 'అర్జున్ రెడ్డి'లో స్టూడెంట్ గా కనిపించిన ఆయన, 'గీత గోవిందం'లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను మెప్పించాడు. ఇక తాజాగా చేస్తోన్న 'డియర్ కామ్రేడ్'లో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ ప్రాజెక్టు తరువాత చేయనున్న సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.
