parasuram: 'గీత గోవిందం' దర్శకుడి తదుపరి సినిమా ఖరారు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5e14cd4ca4846725d6a24938154745631d349713.jpg)
- 'ఓటర్' మూవీ చేస్తోన్న మంచు విష్ణు
- నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
- నిర్మాతగా మోహన్ బాబు
మంచు విష్ణు మొదటి నుంచి కూడా కామెడీకి ప్రాధాన్యతనిస్తూ .. యాక్షన్ ఎంటర్ టైనర్లు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఆచారి అమెరికా యాత్ర' ఆడియన్స్ ను నిరాశ పరిచింది. దాంతో తన తదుపరి చిత్రమైన 'ఓటర్'పై విష్ణు దృష్టి పెట్టాడు. ఈ సినిమా తరువాత ఆయన 'కన్నప్ప' సినిమా చేయనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. కానీ అంతకంటే ముందుగా ఆయన మరొక సినిమా చేయనున్నట్టు సమాచారం.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a8ecb8149e66cd210277c64109288a6000a03559.jpg)