vajpayee: అసలేం జరుగుతోంది?.. వాజపేయి నివాసం వద్ద భద్రత పెంపు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-df9dba8b46c3e2a8152af791e86ee5b5b819b24d.jpg)
- వాజపేయి నివాసం వైపు వెళ్లే మార్గాల మూసివేత
- భారీ ఎత్తున బారికేట్ల ఏర్పాటు
- వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు
మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన చికిత్స పొందుతున్న ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. అసలేం జరుగుతోందో బయట ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు, వాజపేయి నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఆయన నివాసం వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. చుట్టుపక్కల పరిసరాల్లో భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.