High Court: హైకోర్టు నోటీసులపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • కోమటిరెడ్డి, సంపత్ ల బహిష్కరణ కేసు
  • అసెంబ్లీ స్పీకర్ కు నోటీసు ఇచ్చిన హైకోర్టు
  • డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసిన ప్రభుత్వం

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను శాసనసభ నుంచి బహిష్కరించిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆదేశాలు అమలు కాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను ఆగస్ట్ 21కి వాయిదా వేసింది.

High Court
Telangana
government
madhusudanachary
komarireddy
sampath
  • Loading...

More Telugu News