Mahesh Babu: నమ్రత నో చెబితే... నాన్న వద్ద పంచాయితీ పెట్టిన సితార, గౌతమ్!

  • గోవాలో సేదదీరుతున్న మహేష్ బాబు
  • బిడ్డలు ఏదో అడిగితే 'నో' చెప్పిన నమ్రత
  • తండ్రిని డిమాండ్ చేస్తున్న ఫొటో వైరల్

తనకు ఎంతమాత్రం ఖాళీ దొరికినా, భార్యా, పిల్లలతో గడుపుతూ సేదదీరే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన పిల్లలు గౌతమ్, సితారలను మహేష్ ఎంత గారాబంగా పెంచుతున్నాడో అతని భార్య నమ్రత గతంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో చెప్పింది. తాజాగా, తాను కాదన్న వారి కోరికను తీర్చుకునేందుకు తండ్రి వద్ద పంచాయితీ పెట్టారని తెలుపుతూ ఓ పోస్టు చేసింది. అయితే, తను ఏం వద్దని చెప్పింది? వారు ఏం కావాలని అడిగారు? అన్న విషయాలు తెలియరాలేదు. ఈ చిత్రంలో మహేష్ తన బిడ్డలతో కలసి గోవాలోని ఓ కాసినో వద్ద ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.

Mahesh Babu
Namrata
Sitara
Gautam
  • Loading...

More Telugu News