Nara Lokesh: ఈ దేశంలో తన ఇంటిపై జెండాను ఎగరేసుకున్న ఏకైక మంత్రి మన లోకేశ్: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • పోలీసుల గౌరవవందనం కూడా
  • అధికార దుర్వినియోగం అంటే ఇదే
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన విజయసాయి

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న వేళ, లోకేశ్ తన నివాసంలో జెండా ఎగరవేయడాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమే. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని వందనం సమర్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటే ఇదే" అని ఆయన ట్వీట్ చేశారు. లోకేష్ సెల్యూట్, పోలీసుల గౌరవ వందనం సమర్పిస్తున్న ఫొటోలను విజయసాయి తన ఖాతాకు జతచేశారు.

Nara Lokesh
Vijayasai reddy
Flag
Police
August 15
  • Error fetching data: Network response was not ok

More Telugu News