Congress: డొల్ల మాటలు కట్టిపెట్టి నిజాలు మాట్లాడి ఉంటే బాగుండేది: మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపాటు

  • ఎర్రకోట సాక్షిగా మోదీ అబద్ధాలు
  • సామాన్యులకు పనికొచ్చే ఒక్క విషయం కూడా లేదు
  • ప్రజలంతా ఇప్పుడు సచ్ఛే దిన్ కోసం ఎదురు చూస్తున్నారు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ఒక్కటైనా నిజం ఉండి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ విమర్శించింది. తన పదవీ కాలంలో చివరి స్వాతంత్య్ర దినోత్సవంలోనైనా ఆయన అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సిందని ఆక్షేపించింది. మోదీ ప్రసంగం మొత్తం డొల్లేనని తేల్చేసింది. బీజేపీ బోగస్ అచ్ఛేదిన్‌తో ప్రజలు విసిగిపోయారని, వారంతా ఇప్పుడు సచ్ఛేదిన్ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ‌దీప్ సూర్జేవాలా అన్నారు.

అవినీతి, మాబ్ లించింగ్ (మూకదాడులు), చైనా చొరబాటుపై చర్చకు రావాలన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సవాలును మోదీ స్వీకరించాలని సవాలు విసిరారు. మోదీ తన ప్రసంగంలో సామాన్యులకు పనికొచ్చే ఒక్క ముక్కా చెప్పలేదన్నారు. ఎర్రకోట సాక్షిగా ఆయన అబద్ధాలను వల్లె వేశారని సూర్జేవాలా విమర్శించారు.

Congress
BJP
Red fort
Narendra Modi
Randeep singh surjewala
  • Loading...

More Telugu News