Hyderabad: జాతీయ జెండాపై మజ్లిస్ ఎమ్మెల్యే నిలబడ్డట్టు ప్లెక్సీ... స్కూల్ యజమాని అరెస్ట్!

  • పాతబస్తీలో ఘటన
  • హైస్కూల్ లో పంద్రాగస్టు వేడుకల వివాదం
  • వివాదానికి కారణమైన ముంతాజ్ ఖాన్ ఫొటో

జాతీయ పతాకంపై మజ్లిస్ నేత, పాతబస్తీ, యాకుత్ పురా ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ నిలబడ్డట్టు ప్లెక్సీని డిజైన్ చేయించి, తన స్కూల్ ప్రధాన ద్వారం ముందు కట్టించి వివాదం చెలరేగడానికి కారణమైన హైస్కూల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్టీ కాలనీలోని జవహర్ హైస్కూల్ ప్రధాన ద్వారం వద్ద పంద్రాగస్టు వేడుకలకు స్వాగతం పలుకుతూ, ఓ ప్లెక్సీని హైస్కూల్ ఏర్పాటు చేసింది. అంతవరకూ బాగానే ఉందిగానీ, జెండాపై ముంతాజ్ ఖాన్ నిలబడ్డట్టు ఇందులో కనిపించడంతో, పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హైస్కూల్ యజమాని అయూబ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చి దిద్దాల్సిన స్కూలు యాజమాన్యం ఇలా చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Hyderabad
Old City
Mumtaz Khan
Yakutpura
  • Loading...

More Telugu News