Bhuvaneshwar: బంగాళాఖాతంలో నిదానంగా కదులుతున్న వాయుగుండం... నేడు భారీ వర్షాలు!
- భువనేశ్వర్ కు 30 కి.మీ. దూరంలో వాయుగుండం
- నేడు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
- కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా
బంగాళాఖాతంలో నిన్న భువనేశ్వర్ కు 30 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం నిదానంగా కదులుతూ ఉండటంతో, నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి మధ్యాహ్నానికి ఇది పశ్చిమ వాయవ్య దిశకు మారుతుందని భావిస్తున్న అధికారులు, దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, తీరంలో గాలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.